ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:16 AM
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ శుక్రవారం తెలిపారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), జూలై 26: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశా లల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ శుక్రవారం తెలిపారు. ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5వ తేదీ చివరి గడువు అన్నారు. మండల విద్యా శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పిం చాలన్నారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలన తర్వాత ఆగస్టు 17న వాటిని రాష్ట్ర కార్యాలయానికి పంపుతామన్నారు. ఉత్తమ ఉపాధ్యా య అవార్డుతోపాటు నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ అవార్డుకు ఎంపిక చేస్తామన్నారు. జిల్లాలోని అర్హులైన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు 15 సంవత్సరాల రెగ్యులర్ సర్వీసు పూర్తి చేసిన వారు అర్హులన్నారు.