Share News

ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే కఠిన శిక్షలు

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:29 AM

అంటరానితనం, అస్పృశ్యతలు చట్టరీత్యా నేరమని, ఈ కేసుల్లో నేరుగా డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తారని డీఎస్పీ మహేంద్రబాబు అన్నారు.

ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే కఠిన శిక్షలు

డీఎస్పీ మహేంద్రబాబు

చట్టాలపై విద్యార్థులకు అవగాహన

ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అంటరానితనం, అస్పృశ్యతలు చట్టరీత్యా నేరమని, ఈ కేసుల్లో నేరుగా డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేస్తారని డీఎస్పీ మహేంద్రబాబు అన్నారు. సోమవారం పట్టణంలోని వైష్ణవి జూనియర్‌ కళాశాలలో సీఐడీ సీఐ దస్తగిరి ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈ విధమైన నేరాలకు పాల్పడే ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. మనుషులంతా ఒక్కటేనని, అందరూ కలిసికట్టుగా జీవించాలని, కుటుంబ విలవలు కాపాడాలన్నారు. విద్యార్థులు మంచి నడవడిక తోపాటు చురుకుదనం కలిగివుండాలని, విద్య సమాజానికి ఉపయోగపడేలా చూసుకోవాలని సూచించారు. నిరక్ష్యరాసులకు విద్య, ప్రభుత్వ పథకాలను తెలియచేయాలన్నారు. వైష్ణవి కాలేజీ చైర్మన్‌ గడిగె లింగప్ప, డైరెక్టర్‌ విష్ణు, సీఐలు శివప్రసాద్‌, రంగయ్య,ీ శ్రీనివాసులు, విక్రమ్‌సింహ, గంగాధర్‌, ఎస్‌ఐ నాయక్‌, అడ్వకేట్‌ విమలాదేవి, నర్సారెడ్డి, ఆదెన్న, దేవసహాయం పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:29 AM