ఆజాద్ సేవలు చిరస్మరణీయం: కలెక్టర్
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:41 AM
విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ పి.రంజిత బాషా అన్నారు.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ పి.రంజిత బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ బి. నవ్య ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ, మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన, ఏపీఎస్పీ బెటాలియన డీఎస్పీ మహబూబ్ బాషా, మైనార్టీ సంక్షేమ నాయకులు పాల్గొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్: బీ. క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్. నాగస్వామి నాయక్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో లైబ్రేరియన ఎస్.వెంకటేశ్వర్లు, సీనియర్ అధ్యాప కుడు మల్లికార్జున పాల్గొన్నారు.
కర్నూలు కల్చరల్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని నిర్వహించారు. డిప్యూటీ లైబ్రేరియన వి.పెద్దక్క, నికిలేష్ ఎడ్యుకేషనల్ సొసూటీ అధ్యక్షుడు టి. మద్దిలేటి, లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, ఎస్ బాషా పాల్గొన్నారు.
కర్నూలు అర్బన: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువ లేనివని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పి. మురళీకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బజారన్న, షేక్ ఖాజా హుస్సేన, ఎ.వెంకట సుజాత, తిప్పనాయుడు పాల్గొన్నారు.