Share News

నంద్యాల కలెక్టర్‌గా బి.రాజకుమారి

ABN , Publish Date - Jul 02 , 2024 | 11:26 PM

నంద్యాల కలెక్టర్‌గా బి. రాజకుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజకుమారిని, రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరుగా పదోన్నతి కల్పిస్తూ నంద్యాలకు బదిలీ చేసింది.

నంద్యాల కలెక్టర్‌గా బి.రాజకుమారి

గుంటూరు జేసీగా పని చేస్తూ పదోన్నతిపై ఇక్కడికి బదిలీ

నంద్యాల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): నంద్యాల కలెక్టర్‌గా బి. రాజకుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న 2016 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజకుమారిని, రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరుగా పదోన్నతి కల్పిస్తూ నంద్యాలకు బదిలీ చేసింది. రాజకుమారి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొల్లివలస గ్రామం. 2007లో గ్రూప్‌ - 1 అధికారిగా ఎంపికయ్యారు. మొదట విజయనగరం సహకార రిజిస్ట్రార్‌గా ఎంపికైన ఆమె, మరో ప్రయత్నంలో 2009 గ్రూప్‌ - 1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత విజయనగరం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. 2013లో సింహాచలం దేవస్థానం భూ సేకరణ స్పెషల్‌ కలెక్టరుగా విధులు నిర్వహించారు. 2014లో విజయనగరం జడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2017లో తూర్పు గోదావరి జిల్లా డ్వామా పీడీగా, 2019లో కాకినాడ ఆర్డీవోగా కొన్నాళ్లు పని చేశారు. ఆ తర్వాత అక్కడే జాయింట్‌ కలెక్టర్‌ (వెల్ఫేర్‌)గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత తూర్పు గోదావరిలో సచివాలయ జేసీగా, 2021లో గుంటూరు వార్డు, సెక్రటరియేట్‌ జాయింట్‌ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. 2022లో జిల్లాల విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు గుంటూరు జాయింట్‌ కలెక్టరుగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కలెక్టరుగా నంద్యాల రానున్నారు. ఇక ప్రస్తుతం నంద్యాల కలెక్టరుగా పని చేస్తున్న శ్రీనివాసులును ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆయనకు ఎక్కడ పోస్టింగ్‌ ఇచ్చారనే విషయంపై స్పష్టత లేదు.

Updated Date - Jul 02 , 2024 | 11:26 PM