Share News

మద్యం దుకాణాల బంద్‌

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:19 AM

ప్రభుత్వ మద్యం దుకాణాలు బంద్‌ చేయడంతో ఉద్యోగులు నిరసనకు దిగారు.

మద్యం దుకాణాల బంద్‌
నిరసన తెలుపుతున్న ఉద్యోగులు

విధుల్లో కొనసాగాలంటే ప్రత్యామ్నాయం చూపండి

డీసీ కార్యాలయం ఎదుట ఉద్యోగుల నిరసన

కర్నూలు(అర్బన), అక్టోబరు 1: ప్రభుత్వ మద్యం దుకాణాలు బంద్‌ చేయడంతో ఉద్యోగులు నిరసనకు దిగారు. ప్రభుత్వ నూతన మద్యం పాలసీ తెరపైకి తీసుకురావడంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగులు తమ కు ప్రత్యామ్నాయం చూపితేనే విధుల్లో కొనసాగుతామంటూ హెచ్చరికాలు జారీ చేశారు. దుకాణాలు తెరవకపోతే కేసులు పెడతామంటూ ఎక్సైజ్‌ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని 97 మద్యం దుకాణాల్లో సూపర్‌ వైజర్లు- 97, సేల్స్‌ మ్యాన్స-278, వాచమన్స 110 మంది కొనసాగుతున్నారు. వీరందరికీ సంబంధించి అగ్రిమెంట్‌ సెప్టెంబరు 30తో పూర్తయింది. కొత్త మద్యం పాలసీ అమలయ్యే వరకు ఈనెల 11 వరకు ఉద్యోగులు విధుల్లో కొనసాగాలని ఎక్స్‌జ్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లాలోని 97 మద్యం దుకాణాలు మూతపడ్డాయి. తెరిపించేందుకు ఎక్సైజ్‌ అధికారులు సాయంత్రం వరకు చేసిన ప్రయ త్నాలు ఫలించ లేదు. దాదాపు ఒక్క రోజకు రూ. 1.80 కోట్ల వ్యాపారం ప్రభుత్వం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక మందుబాబులు మద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లి తాగాల్సిన పరిస్థితి. తమకు ప్రత్యా మ్నాం చూపాలని సాయంత్రం జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులు నిరసన తెలిపారు. స్పందించిన డిప్యూటీ కమిషనర్‌ ఎం. శ్రీదేవి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వెంటనే విధులకు హాజరు కావాలని హుకుం జారీ చేశారు. గత ఐదేళ్లుగా పని చేశామని, ప్రత్యామ్నాయం చూపకపోతే మా కుటుంబాలు రోడ్డున పడతాయని ఉద్యో గుల రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బీ. జతిన చంద్రారెడ్డి వాపోయారు. ప్రత్యా మ్నాయం చూపిస్తామని హామీ పత్రం ఇవ్వాలని, లేనిపక్షంలో స్టాక్‌ మొత్తం లిక్కర్‌ డిపోకు ఇచ్చి వేసి విధులు బష్కిరిస్తామని హెచ్చరించారు.

Updated Date - Oct 02 , 2024 | 12:19 AM