Share News

మెరుగైన వైద్య సేవలందించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Dec 20 , 2024 | 11:57 PM

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు.

మెరుగైన వైద్య సేవలందించాలి: కలెక్టర్‌
వైద్యాధికారులతో సమావేశమైన కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ రాజకుమారి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల పనితీరుపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో వైద్య సేవలు మొరుగుపడాలని, ఓపీ సంఖ్య పెరగడంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాతాశిశు మరణాల జీరో స్థాయికి చేరుకోవాలన్నారు. బాలింతలు, గర్భిణులు రక్తహీనతను అధిగమించేందుకు స్త్రీ శిశు సంక్షేమ అధికారులను సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్‌ వైద్యసేవలు మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గుండె సంబంధిత చికిత్సలు, ఇంజెక్షన్లు, ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. ప్రభుత్వాసుపత్రులలో కాలం చెల్లిన మందులు, ఇతర వృథా పరికరాలను టెండర్లను పిలిచి వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 11:57 PM