సైబర్ నేరాలతో జాగ్రత్త: ఎస్పీ
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:34 PM
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లలో వచ్చే వెబ్‌సైట్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఎస్పీ బిందుమాధవ్ పిలుపునిచ్చారు.
ఎమ్మిగనూరు టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్లలో వచ్చే వెబ్‌సైట్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని ఎస్పీ బిందుమాధవ్ పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప కూడలిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలతో పాటు విద్యార్థులు భారీ ఎత్తున హాజరయ్యారు. ముందుగా ఓంశాంతి సర్కిల్ వద్ద ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు రూ.11 కోట్ల మేర సైబర్ క్రైమ్ జరిగిందన్నారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు వి.శ్రీనివాసులు, విక్రమ్‌సింహ, గంగాధర్, ప్రసాద్, అబ్దుల్ గౌస్, ఎస్‌ఐలు డాక్టర్ నాయక్, శ్రీనివాసులు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.