Share News

ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:44 PM

ఎమ్మిగనూరులో మున్సిపల్‌ కౌన్సిలర్లు వైసీపీకి షాకిచ్చారు. మంగళవారం వైసీపీని వీడి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పట్టణంలోని కౌన్సిలర్లు స్వాతి (3వవార్డు) అబ్దుల్‌ వాహిద్‌ (16వ వార్డు), సరోజమ్మ(చైర్మన్‌ తల్లి) (25వ వార్డు), మాజీ కౌన్సిలర్‌ వహబ్‌, నాయకులు వినయ్‌, జాహీర్‌, మన్సుర్‌ పెద్దఎత్తున ర్యాలీగా ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు

ఎమ్మిగనూరులో వైసీపీకి షాక్‌
ఎమ్మెల్యే బీవీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు

ఎమ్మెల్యే బీవీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు

ఎమ్మిగనూరు, అక్టోబరు22 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరులో మున్సిపల్‌ కౌన్సిలర్లు వైసీపీకి షాకిచ్చారు. మంగళవారం వైసీపీని వీడి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. పట్టణంలోని కౌన్సిలర్లు స్వాతి (3వవార్డు) అబ్దుల్‌ వాహిద్‌ (16వ వార్డు), సరోజమ్మ(చైర్మన్‌ తల్లి) (25వ వార్డు), మాజీ కౌన్సిలర్‌ వహబ్‌, నాయకులు వినయ్‌, జాహీర్‌, మన్సుర్‌ పెద్దఎత్తున ర్యాలీగా ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. వీరికి ఎమ్మెల్యే బీవీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో సైతం పట్టణంలోని వైసీపీకి చెందిన ఐదు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరగా తాజాగా మరో ముగ్గురు కౌన్సిలర్లు చేరారు. టీడీపీలో చేరిన కౌన్సిలర్లలో మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ రఘు తల్లి సరోజమ్మ, ఆయన సమీప బంధువు మూడో వార్డు కౌన్సిలర్‌ స్వాతి ఉండటం విశేషం. మున్సిపల్‌ కౌన్సిల్‌లో టీడీపీ సభ్యుల సంఖ్య 10కి చేరింది. వైసీపీకి చెందిన మరి కొంతమంది కౌన్సిలర్లు కూడా టీడీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే చేరనున్నట్లు తెలిసింది. ఇది ఇలాగే కొనసాగితే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో వైసీపీ ఖాళీ అయ్యో పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఎమ్మిగనూరు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ది జరగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని గ్రహించి నేడు వైసీపీనుంచి టీడీపీలోకి చేరుతున్నారన్నారు. పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావటానికి వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి రావటం అభినందనీయమన్నారు. పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కౌన్సిలర్లు వార్డుప్రజలకు ఇచ్చిన హామీలను తాను నెరవేరుస్తానన్నారు.రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి అజెండాగా ముందుకు పోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు అల్తాఫ్‌, ఆమాన్‌, వినయ్‌, ఇస్సాక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:44 PM