Share News

నేడు ఆలూరుకు చంద్రబాబు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:42 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఆలూరుకు రానుండటంతో గురువారం టీడీపీ నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు.

నేడు ఆలూరుకు చంద్రబాబు

ఆలూరు, ఏప్రిల్‌ 17: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం ఆలూరుకు రానుండటంతో గురువారం టీడీపీ నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలూరు పట్టణ శివారులోని అగ్రహారం కొండల్లో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ జోనల్‌-5 ఎన్నికల సమన్వయకర్త వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరుటీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్‌, కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబునాయుడు ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చి, అక్కడి నుంచి రోడ్‌ షో ద్వారా అంబేడ్కర్‌ సర్కిల్‌కు చేరుకొని ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీ జన సమీకరణకు వీరభద్రగౌడ్‌ ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Apr 18 , 2024 | 11:42 PM