బీసీల సంక్షేమానికి చంద్రబాబు చొరవ
ABN , Publish Date - Dec 25 , 2024 | 12:37 AM
ఎన్నికల ప్రచారంలో బీసీల సంక్షేమంపై ఇచ్చిన హామీలు, పథకాల అమలుకు సీఎం చంద్రబాబు చొరవ చూపుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు
కర్నూలు అర్బన్, డిసెంబర్ 24(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో బీసీల సంక్షేమంపై ఇచ్చిన హామీలు, పథకాల అమలుకు సీఎం చంద్రబాబు చొరవ చూపుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో బీసీ సెల్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన రూ. 110 కోట్ల బకాయిల్లో ఇప్పటికే రూ.76.38 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ప్రభుత్వం చెల్లించగా పెండింగ్ ఉన్న రూ.34.14 కోట్లను త్వరలో చెల్లించాలని ఆదేశించారని గుర్తు చేశారు. 2024-25 విద్యాసంవత్సరానికి బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.135 కోట్లు కేటాయించిందన్నారు. స్కిల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్, నైతిక విలువలు, నీతి శాస్త్రం, డిజిటల్ లీటరసిపై బీసీ విద్యార్థులకు శిక్షణకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. 26 జిల్లాల్లో 104 బీసీ హాస్టళ్లలో పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణ, బీసీ నాయకులు మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొతురాజు రవికుమార్, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ధరూర్ జేమ్స్, రాష్ట్ర సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చింతమాను సురేంద్రనాయుడు, జిల్లా బీసీ యూత్ అధ్యక్షుడు కిరణ్, దేవేంద్రగౌడ్, వీరేష్, డీవీ చంద్ర తదితరులు పాల్గొన్నారు.