Share News

ఉదోగ్యం పేరుతో మోసం

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:25 AM

ఉద్యోగాలు ఇప్పిస్తా మని తమను మోసగించారని పలువు రు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉదోగ్యం పేరుతో మోసం
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ జి.బిందు మాధవ్‌

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో బాధితుల ఫిర్యాదు

ప్రకారం విచారణ చేసి న్యాయం చేస్తాం

కర్నూలు ఎస్పీ జి.బిందు మాధవ్‌

కర్నూలు క్రైం అక్టోబరు 21, (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు ఇప్పిస్తా మని తమను మోసగించారని పలువు రు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్పీని కలిసి తమ గోడును వెలుబుచ్చారు. సోమవారం కర్నూలు నగరంలోని క్యాంపు కార్యాల యంలో ఎస్పీ బిందుమాధవ్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు.

ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. మొత్తం 100 వినతులు వచ్చాయి. అలాగే వృద్ధురాలి వద్దకు నేరుగా వెళ్లి ఫిర్యాదు స్వీకరించి న్యాయం చేస్తానని ఎస్పీ భరోసా ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ జి.బిందు మాధవ్‌ హామీ ఇచ్చారు. అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జున రావు, సీఐ శివశంకర్‌ పాల్గొన్నారు.

ఇవీ వినతులు..

కర్నూలు ఫుడ్‌ కార్పొరేషన్‌ డిపార్టుమెం ట్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.3.5 లక్షలు తీసుకుని తనను కర్నూలుకు చెందిన ఆయేషా బాను మోసగించిందని వినయ్‌గౌడ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

నదితీర ప్రాంతాల పోర్టులో థర్డ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన వై.నాగేశ్వరరావు రూ.ఏడు లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆదోనికి చెందిన ప్రవీణ్‌ ఫిర్యాదు చేశారు.

అత్తమామలు కుటుంబ సమస్యలు, అవసరాల కోసం తన బంగారం తీసుకుని వాడుకున్నారు. ఇప్పుడు అడిగితే.. ఇవ్వడం లేదని కర్నూలు పసుపుల గ్రామానికి చెందిన లక్ష్మిదేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని వేడుకున్నది.

తాను అనంతపురంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాను. నాకు ఫేస్‌బుక్‌ ద్వారా కార్తీక్‌ పరిచయం అయ్యాడు. రూ.7 లక్షలు తీసుకుని మోసం చేశాడని గూడూరు మంలం నాగులాపురం చెందిన సలీమా ఫిర్యాదు చేశారు.

నా కుమార్తె కేశమ్మ ఎంబీఏ చేసింది. నా కుమార్తెకు అల్పాభీట్‌ గ్రూప్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసిన అనంతపురం చెందిన సత్యనారాయణపై చర్యలు తీసుకోవా లని గూడూరు మండలం గుడిపాడుకు చెందిన రైతు దుబ్బన్న ఫిర్యాదు చేశారు.

తనకు ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడికి కంటి చూపు సరిగ్గా లేదు. పెద్ద కుమారుడు వెంకటేశ్వర ఆచారి నాకు వచ్చిన ఇల్లును తీసుకుని అన్నం, బాగోగులు చూడ డం లేదని, బిక్షాటన చేయిస్తున్నాడని కర్నూ లుకు చెందిన మునెమ్మ ఫిర్యాదు చేసింది.

Updated Date - Oct 22 , 2024 | 01:25 AM