Share News

మహానందిలో మళ్లీ చిరుత సంచారం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:26 AM

మహానంది సమీపంలో మళ్లీ చిరుత పులి సంచరించడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

మహానందిలో మళ్లీ చిరుత సంచారం
ఆలయ పరిసరాల్లో చిరుత

మహానంది, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మహానంది సమీపంలో మళ్లీ చిరుత పులి సంచరించడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొంత కాలం నుంచి చిరుతపులి సంచారం లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత దైవ దర్శనం కోసం వచ్చిన అయ్యప్ప భక్త బృందంలోని కొందరు కాల కృత్యాలు తీర్చుకునేందుకు ఆలయం వెనుక వైపునకు వెళ్లారు. చిరుతపులి సంచరించడం గమనించి కేకలు వేస్తూ పరుగులు తీశారు. అలాగే మహానంది పరిసరాల్లోని పార్వతీపురం శివారు వైపు కూడా చిరుత అర్ధరాత్రి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. కొన్ని నెలల నుంచి చిరుతపులి కదలికలు మహానంది ఆలయ పరిసరాల్లో లేకపోవడంతో ప్రశాంతంగా ఉన్న స్థానికులు మళ్లీ చిరుత సంచారంతో ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:26 AM