శైవ క్షేత్రాల్లో ప్రధాన న్యాయాధికారి పూజలు
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:07 AM
నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శైవ క్షేత్రాల్లో కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది, ఆయన సతీమణి గాయత్రి, ప్రధాన సీనియర్ సివిల్ న్యాయాధికారి మల్లీశ్వరి పూజలు నిర్వహించారు.
బండిఆత్మకూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన శైవ క్షేత్రాల్లో కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది, ఆయన సతీమణి గాయత్రి, ప్రధాన సీనియర్ సివిల్ న్యాయాధికారి మల్లీశ్వరి పూజలు నిర్వహించారు. మండలంలోని ఓంకారం, శివనంది క్షేత్రాల్లో ఆదివారం న్యాయమూర్తులకు ఈవో నాగప్రసాద్ అర్చకులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వారు ఆయా క్షేత్రాల్లో గంగా ఉమా సమేత సిద్ధేశ్వర, శివనందీశ్వర స్వామివార్లకు పూజలు చేశారు. అలాగే కృష్ణనంది క్షేత్రంలో స్వామివార్లను న్యాయాధికారి దంపతులు పూజలు చేశారు.