పంటలను దెబ్బతీసిన వాతావరణం
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:01 AM
మండలంలో దాదాపు 2 వేల ఎకరాల్లో మిరప, వెయ్యి ఎకరాల్లో మొకజొన్న, మూడు వేల ఎకరాల్లో వేరుశనగ, వెయ్యి ఎకరాలు జొన్న, వెయ్యి ఎకరాలకు పైగా శనగ సాగు చేశారు. అయితే వాతావరణం అనుకూలించకపోవ డంతో పంటలు దెబ్బతింటున్నాయి.
తెగుళ్ల బారిన మిరప, మొక్కజొన్న, వేరుశనగు
మిరపలో తగ్గిన దిగుబడి, మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి
దేవనకొండ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలో దాదాపు 2 వేల ఎకరాల్లో మిరప, వెయ్యి ఎకరాల్లో మొకజొన్న, మూడు వేల ఎకరాల్లో వేరుశనగ, వెయ్యి ఎకరాలు జొన్న, వెయ్యి ఎకరాలకు పైగా శనగ సాగు చేశారు. అయితే వాతావరణం అనుకూలించకపోవ డంతో పంటలు దెబ్బతింటున్నాయి.
మిరప దిగుబడిపై ప్రభావం
వాతావరణ ప్రభావం మిరప దిగుబడిపై పడింది. తాళ్లు కాయ, నల్లమచ్చ రావడతో ధర రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటపై ఎర్ర, తెల్లనల్లి, ఆకు ముడత వైరస్ దాడి చేశాయి. అలాగే మొక్కజొన్న, వేరుశనగ పంటలపై లద్దె పురుగు(కత్తెరపురుగు) తాకిడి ఉంది. ఈ పురుగు ఆకులు, సుడిని కోరికేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
మందులు పిచికారీ చేసినా...
వైరస్, ఆకుముడత, తెల్ల, ఎర్ర నల్లి, బుడిద తెగుళ్లు, వేరుకుళ్లు, శిలీంధ్ర నాశని తదితర తెగుళ్లు పంట ను ఆశించాయి. వీటి నివారణకు వారంలో రెండు సార్లు మందులు పిచికారీ చేసిన ప్రయో జనం లేదని రైతులు వాపోతున్నారు. రైతుల కష్టా లను ఆసరాగా చేసుకున్న దుకాణ దారులు బయో మందులు అంటక డుతున్నారని ఆరోపణలున్నాయి. .
అధిక తేమ లేకుండా చూసుకొవాలి
మిరపలో ఎక రాకు 40 నుంచి 50 నీలి, పసుపు రంగు జిగురు అ ట్టలు అమర్చాలి, వేపనూనె పిచి కారీ చేయాలి. తామర పురుగు ఉధృ తి ఉంటే డైమితోయేట్ 30 శాతం ఇ.సి. 2 మీ.లీ లీటరుకు, లేదా ఫిప్రో నిల్ 40 శాతం మరియు ఇమిడా క్లోప్రిడ్ 40 శాతం, డబ్ల్యూజీ 0.30 గ్రా. లీటరు కలపాలి. నల్లి నివారణకు ఇతియాన్ 50 శాతం ఇ.సి 2.5 మీ.లి లేదా ఫ్రాపర్గైట్ 57శాతం, ఇ.సి0.50 మీ.లీ లీటరు నీటికి కలిపి, ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకొవాలి. - దస్తగిరి, ఉద్యాన అధికారి