Share News

సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:08 AM

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు.

సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన
మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి

మంత్రాలయం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన రెడ్డి అసెంబ్లీకి రాకుండా తప్పించుకో వడం సిగ్గు చేటన్నారు. మంగ ళవారం స్థానిక పంకజ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌ సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేసే దిశగా, వ్యవసాయం, సంక్షేమ, అభివృద్ధిపై ప్రజారంజక బడ్జెట్‌ అని అన్నారు. ఈ బడ్జెట్‌లో వచ్చే ఐదేళ్లలో రాష్ట్రం అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తోం దన్నారు. ఐదేళ్లు చేసిన అరాచకాలు బయటపడుతాయని జగన రెడ్డి అసెంబ్లీకి రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని ఆరోపించారు. గురు రాఘవేంద్ర, ఆర్డీఎస్‌కు, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుందన్నారు. సమావేశంలో మండల కన్వీనర్‌ పన్నగ వెంకటేశ స్వామి, క్లస్టర్‌ ఇనచార్జి ఎల్లారెడ్డి, టీడీపీ బీసీ సెల్‌ నియో జకవర్గ అధ్యక్షులు పైబావి అమ ర్నాథ్‌ రెడ్డి, విజయరామిరెడ్డి, అండే హనుమంతు, తిక్కస్వామి గౌడు, సుంకప్ప పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం: పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం చెట్నహల్లి టీడీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ బెస్త ఈరన్న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుని ఇంటికి రాగా వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ పన్నగ వెంకటేశ స్వామి, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, విజయరామిరెడ్డి, రవి, తిక్కస్వామి గౌడు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:08 AM