Share News

భోజనంలో ఈగలు... సాంబార్‌లో బొద్దింకలు..!

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:54 AM

నాణ్యత, శుభ్రత పాటించాల్సిన హోటళ్ల నిర్వాహకులు నిబంధనలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. తాజాగా ఆత్మకూరు పట్టణంలోని గీతా హోటల్‌లో కస్టమర్లకు ఇచ్చిన ఆహారంలో ఈగలు, సాంబార్‌లో బొద్దింకలు వచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ

భోజనంలో ఈగలు... సాంబార్‌లో బొద్దింకలు..!
అధికారులు జరిమానా విధించించిన హోటల్‌ ఇదే..

కస్టమర్ల నుంచి ఫిర్యాదులు

ఆత్మకూరు గీతా మెస్‌కు రూ.50వేలు జరిమానా విధింపు

ఆత్మకూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): నాణ్యత, శుభ్రత పాటించాల్సిన హోటళ్ల నిర్వాహకులు నిబంధనలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. తాజాగా ఆత్మకూరు పట్టణంలోని గీతా హోటల్‌లో కస్టమర్లకు ఇచ్చిన ఆహారంలో ఈగలు, సాంబార్‌లో బొద్దింకలు వచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఫిర్యాదులు అందుకున్న అధికారులు విచారణ చేసి రూ.50వేలు జరిమానా విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫుడ్‌ సేఫ్టీ అఽధికారులు ఖాశీంవలి, వెంకటరాముడు శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కొంతమంది కస్టమర్లు హోటల్‌కు భోజనం చేయగా సాంబార్‌లో బొద్దింక, ఈగలు రావడంతో ఇదేమని నిర్వాహకులను కస్టమర్లు ప్రశ్నించారన్నారు. అయితే నిర్వాహ కులు బాధ్యతా రహితంగా వ్యవహ రించడంతో పాటు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అంటూ దురుసుగా సమాధానం చెప్పార న్నారు. దీంతో కస్టమర్లు తమకు ఫిర్యాదు చేశారన్నారు. తాము హోటల్‌ను, అక్కడి పరిసరాలను పరిశీలించి నివేదికను జేసీ విష్ణు చరణ్‌ తేజకు సమర్పించామన్నా రు. ఆయన నివేదికన పరిశీలించి హోటల్‌ యజమానికి రూ.50వేలు జరిమానా విధించినట్లు పుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఖాశీంవలి వెల్లడించారు.

Updated Date - Dec 22 , 2024 | 12:54 AM