Share News

నెలాఖరులోగా పూర్తి చేయండి : మంత్రి బీసీ

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:06 AM

జిల్లాలో రోడ్ల్లపై గుంతలు పూడ్చే పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రోడ్లు, భవనాలు, పెట్టుబ డులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు.

నెలాఖరులోగా పూర్తి చేయండి : మంత్రి బీసీ
మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కర్నూలు కలెక్టరేట్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్ల్లపై గుంతలు పూడ్చే పనులు ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రోడ్లు, భవనాలు, పెట్టుబ డులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆర్‌అండ్‌బీ నేషనల్‌ హైవే, మున్సిపల్‌ శాఖల అధికారులతో రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కర్నూలు డివిజన్‌లో 41 శాతం మాత్రమే జరిగాయని, ఈ పనులు వేగవంతం చేయాలని విజన్‌ ఈఈని ఆదేశించారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తవుతాయని అన్నారు. న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వర్క్స్‌ కింద మంజూరు చేసిన రోడ్డు పనులు ఇంకా మొదలు కాలేదని, 10 రోజుల్లో పనులు మొదలు పెట్టాలని మంత్రి ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య, అసిస్టెట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్వో సి. వెంకటనారాయణమ్మ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ చిరంజీవి, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:06 AM