Share News

భూసేకరణ పూర్తి చేయండి

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:43 PM

జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలకు ప్రతిపాదనల మేరకు భూసేకరణ ను త్వరతిగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ రాజకుమారి రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

భూసేకరణ పూర్తి చేయండి
వీడియో కాన్పరెన్స్‌లో రెవిన్యూ అధికారులను ఆదేశిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పరిశ్రమలకు ప్రతిపాదనల మేరకు భూసేకరణ ను త్వరతిగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ రాజకుమారి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌తో కలిసి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ 340సి ప్యాకేజీ 4కింద నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల మీదుగా వెళ్లే రహదారి భూసేకరణకు సంబంధించి 39 ఎకరాలకు క్లెయిమ్స్‌ మండల తహసీల్దార్ల నుంచి క్లెయిమ్స్‌ తెప్పించుకొని నిశితంగా పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని ఆర్డీవోలకు సూచించారు. అలాగే 1.98 కిమీ సంబంధించిన అడ్డంకులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంబంధిత వ్యక్తులను సంప్రదించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 167కె ఒకటో ప్యాకేజీ కింద నంద్యాల నుండి జమ్మలమడుగు మీదుగా నంద్యాల, గోస్పాడు, దొర్నిపాడు, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, సంజామల మండలాల మీదుగా వెళ్లే రహదారి క్లెయిమ్స్‌ అవార్డ్స్‌ పాసయ్యాయని త్వరగా క్లెయిమ్స్‌ తెప్పించుకొని భూమి రాశి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గుంటూరు-గుంతకల్‌ డబుల్‌ రైల్వే లైనింగ్‌ పనుల భూసేకరణను వెంటనే పూర్తిచేసి పంపాలని డోన్‌, నంద్యాల ఆర్డీఓలును కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Nov 19 , 2024 | 11:43 PM