Share News

లడ్డూ ప్రసాదం కల్తీపై ఆందోళన

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:23 AM

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై విశ్వహిందూ పరిషత్‌, వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

లడ్డూ ప్రసాదం కల్తీపై ఆందోళన
నిరసన తెలుపుతున్న పీఠాధిపతులు, హిందూ సంఘాల నాయకులు

ఆదోని టౌన్‌, అక్టోబరు 1 : తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై విశ్వహిందూ పరిషత్‌, వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే పార్థసారథి ర్యాలీని ప్రారంభించారు. వందలాదిమంది. హిందువులు, భక్తులు నినాదాలు చేశారు. భీమస్‌ కూడలిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. టీటీడీని దేవదాయ శాఖ నుంచి తొలగించి స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ప్రకటించాలని కోరుతూ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ర్యాలీలో కల్లుమఠం పీఠాధిపతి గురుసిద్ద లింగ దేవరు, సుబ్రహ్మయ్యం భారతి (మైసూరు) అయోధ్య నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ, బీజేపీ నాయకులు కునిగిరి నీలకంఠ, విట్టా రమేష్‌, జనసేన ఇన్‌చార్జి మల్లప్ప, శ్రీనివాస ఆచారి, చెన్న బసప్ప, ఈరన్న రావు, కొంగే పంపావతి పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:23 AM