Share News

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై సదస్సు

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:56 PM

ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టాలపై గడివేముల గ్రామ ఏపీ మోడల్‌ స్కూల్‌లో పోలీస్‌ అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు.

ఎస్సీ, ఎస్టీ చట్టాలపై సదస్సు
ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసు అధికారులు

నంద్యాల క్రైం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టాలపై గడివేముల గ్రామ ఏపీ మోడల్‌ స్కూల్‌లో పోలీస్‌ అధికారులు సదస్సు ఏర్పాటు చేశారు. కర్నూలు సీఐడీ రీజినల్‌ ఆఫీసు ఆర్‌ఓ, డీఎస్పీ వాహిద్‌బాషా, నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సదస్సులో పోలీసు అధికారులు ఎస్సీ, ఎస్టీ వర్గాలపై అఘాయిత్యాలు, వివక్షను నివారించడానికి రూపొందించిన ఎస్సీ, ఎస్టీ, పీఓఏ చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించారు. కుల ఆధారిత హింస, వివక్ష, సాంఘిక బహిష్కరణతోసహా కమ్యూనిటీల సభ్యులపై చేసిన నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీల హక్కుల గురించి తెలియజేశారు. ఈ కమ్యూనిటీలపై అట్రాసిటీ, వివక్ష, హింస కేసులను ఎలా నిర్వహించాలనే దానిపై చట్టాన్ని అమలు చేసే అధికారులు, ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే న్యాయపరమైన వనరులు, న్యాయం కోరే ప్రక్రియ గురించి తెలియజేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలను బలోపేతం చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులు వివక్ష, హింసను ఎలా నిరోధించాలనే దానిపై వివరణాత్మక సందేశం ఇచ్చారు. ఈ అవగాహన సదస్సులో జిల్లా అధికారులు, పోలీస్‌ అధికారులు, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ కమిటీ సభ్యులు అవగాహన కల్పించారు. జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి చింతామణి, ఎంపీడీవో వాసుదేవగుప్త, తహసీల్దార్‌ వెంకటరమణ, సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌, పాణ్యం ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, గడివేముల ఎస్సై సీసీ నాగార్జునరెడ్డి, మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ శైలజ, కొమ్ముపాలెం శ్రీనివాసులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:56 PM