గ్రంథాలయాల ఆధునికీకరణకు సహకారం
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:43 AM
గ్రంథాలయాల ఆధునికీకరణకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు కల్చరల్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): గ్రంథాలయాల ఆధునికీకరణకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్స వాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథు లుగా టీజీ వెంకటేశ్, కేవీఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పుష్పమాల వేసి జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ యువత వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పుస్తకాలు, మెటీరియల్ అందుబాటులో పెట్టాలని అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్టడీ ల్యాబ్‌లో ఏసీతోపాటే అన్ని రకాల పుస్తకాలు అందజేస్తూ తగిన సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. వారం రోజులుగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథులు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కేసీ కల్కూర, సాహితీ సదస్సు సంస్థ కార్యదర్శి జేఎస్‌ఆర్‌కే శర్మ, విశ్రాంత ఇంజినీర్ ముచ్చుకోట చంద్రశేఖర్, నిఖిలేశ్ ఎడ్యుకేషన్ అకాడమీ అధ్యక్షుడు టి. మద్దులేటి, డిప్యూటీ లైబ్రేరియన్ వి. పెద్దక్క, లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి పాల్గొన్నారు.