Share News

‘పౌర సరఫరా’లో అవినీతి

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:31 AM

గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల విభాగాన్ని అవినీతి కూపంగా మార్చారని, పేదలకు రాయితీ బియ్యం సరఫరాలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన డైరెక్టర్‌ కొంగతి లక్ష్మీనారాయణ ఆరోపించారు.

‘పౌర సరఫరా’లో అవినీతి
గోదామును తనిఖీ చేస్తున్న కొంగతి లక్ష్మీనారాయణ

గత ప్రభుత్వంలో భారీ ఎత్తున అక్రమాలు

నాణ్యమైన బియ్యం అందించడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన డైరెక్టర్‌ కొంగతి లక్ష్మీనారాయణ

కర్నూలు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల విభాగాన్ని అవినీతి కూపంగా మార్చారని, పేదలకు రాయితీ బియ్యం సరఫరాలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన డైరెక్టర్‌ కొంగతి లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం కర్నూలు నగరం రేడియో స్టేషన సమీపంలో ఉన్న పౌర సరఫరాల శాఖ బఫర్‌ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం సహా గోదాములో నిల్వ చేసిన సరుకుల రికార్డులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు భారం భరిస్తూ పేదలకు రాయితీ బియ్యం ఇస్తుందని, తూకాల్లో తేడా లేకుండా సరఫరా చేయాలని సూచించారు. అనంతరం లక్ష్మీనారాయణ విలేకరులతో మాట్లాడారు. పేదలకు మూడు పూటల ఆకలి తీర్చి ఆహార భద్రత కల్పించాలనే ఉన్నత ఆశయంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహనలు పేదల కు నాణ్యమైన బియ్యం అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సివిల్‌ సప్లయ్‌ను అవినీతి అక్రమాల కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, సిబ్బం దే ఉన్నారని, గతంలో కాకుండా టీడీపీ కూటమి లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. గతంలో లాగే పని చేస్తామంటే శాఖప రమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుందని హెచ్చరించారు.

Updated Date - Nov 20 , 2024 | 12:31 AM