కౌన్సిల్ సమావేశం రసాభాస
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:43 PM
మునిసిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. చైర్‌పర్సన్ శాంత వాల్మీకి అధ్యక్షతన బుధవారం సాధారణ సమావేశం నిర్వహించారు.
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ల మధ్య వాగ్వాదం
ఆదోని టౌన్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి) : మునిసిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. చైర్‌పర్సన్ శాంత వాల్మీకి అధ్యక్షతన బుధవారం సాధారణ సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ నరసింహులు తీవ్ర వాదోపవాదాలు చేసుకోవడంతో గందరగోళంగా మారింది. వైస్ చైర్మన్‌కు వేసే చైర్ విషయంలో ప్రారం భమైన మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరిది. మునిసిపల్ యాక్టు ప్రకారం సీట్లను వేస్తున్నట్లు కమిషనర్ కృష్ణ సమాధానం ఇచ్చారు. గతంలో స్వచ్ఛ భారత్ కింద మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కౌన్సిలర్లు సురేష్, లలితమ్మ, పద్మావతి ప్ల కార్డులతో చైర్మన్ పొడియం ముందు బైఠాయించారు. గతంలోనే ఈ విచారణ జరిగిందని గత ప్రభుత్వ హయాంలో జరిగిన దానిపై ఇప్పుడు చర్చిం చడం సరికాదని వైస్ చైర్మన్ నరసింహులు వాదించారు. పాత బస్టాండ్‌లో నిర్మిస్తున్న కాంప్లెక్స్ పనులు ఆగిపోవడంతో డబ్బులు చెల్లించిన వారు ఆందోళన చెందుతున్నారని, కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించి పనులు కొనసాగేలా 30 మంది కౌన్సిలర్లు మెమో రాండం ఇచ్చినా సమాధానం లేకపోవడంపై వైస్ చైర్మన్ నరసింహులు వాగ్వాదానికి దిగారు. సమాధానం రాకపోవడంతో వైసీపీ కౌన్సిలర్లు బాయ్‌కాట్ చేయడంతో సమావేశం వాయిదా పడింది. ఎంఈ ఇంతియాజ్ ఆలీ, డీఈ రామమూర్తి, ఏసీసీ కృష్ణసింగ్, ఆర్‌వో అస్లాం పాల్గొన్నారు.