Share News

పంట నమోదు చేసుకోవాలి: ఏడీఏ

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:00 AM

రబీలో పంట నమోదు తప్పక చేసుకోవాలని ఏడీఏ మోహన విజయకుమార్‌ సూచించారు. సోమవారం పత్తికొండ మండలం హోసూరులో పంటనమోదును సోమవారం పరిశీ లించారు.

పంట నమోదు చేసుకోవాలి: ఏడీఏ
పత్తికొండ: హోసూరులో అవగాహన కల్పిస్తున్న ఏడీఏ, ఏవో

రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయాధికారులు

పత్తికొండ/టౌన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రబీలో పంట నమోదు తప్పక చేసుకోవాలని ఏడీఏ మోహన విజయకుమార్‌ సూచించారు. సోమవారం పత్తికొండ మండలం హోసూరులో పంటనమోదును సోమవారం పరిశీ లించారు. ఈనెల 15లోగా బీమా ప్రీమియాన్ని చెల్లించాలని, పప్పుశనగకు రూ.420లు, వేరుశనగకు రూ.480లు, జొన్నకు రూ.297లు, ఉల్లికి రూ.1,350లు, టమోటాకు రూ.1,500లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏవో వెంకట రాముడు సిబ్బంది రియాజ్‌, బాషా, శ్రీనివాసులు, శివప్రసాద్‌, రమేష్‌ ఉన్నారు.

మద్దికెర: రైతులు రబీలో సాగు చేసిన శనగ, వాము, జొన్న పంటలకు ఈక్రాప్‌ నమోదు చేసుకోవాలని ఏవో రవి సూచించారు. సోమవారం మద్దికెరర, ఎం.అగ్రహారం గ్రామాల్లో ఈక్రాప్‌ నమోదును తనిఖీ చేశారు. సిబ్బంది జాకీర్‌, ఆనంద్‌, కవిత, రాణి ఉన్నారు.

తుగ్గలి: రబీలో పంటలను ఈ-క్రాప్‌ నమోదు చేయించడం తప్పనిసరని తహసీల్దార్‌ రమాదేవి, ఏవో పవన్‌ కుమార్‌ సూచించారు. సోమవారం తుగ్గలిలో ఈ-క్రాప్‌ నమోదును ప్రారంభించారు. ఈక్రాప్‌ చేయకుంటే ప్రభుత్వ సబ్సిడీ, పంట నష్టపరిహారం, బీమా, సున్నావడ్డీ, పంట కొనుగోలు అందవన్నారు. బీమా ప్రీమియాన్ని ఈ నెల 15వ తేదీలోపు చెల్లించాలన్నారు. వీఆర్వో నవీద్‌ పటేల్‌, ఎంపీఈవో స్రవంతి, వీఏవో లోహిత్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:00 AM