‘చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి చేయండి’
ABN , Publish Date - Jun 20 , 2024 | 11:52 PM
చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి పరచాలని జిల్లా పంచాయతీ అధికారి మంజులవాణి ఆదేశించారు.
పాణ్యం, జూన్ 20: చెత్త సంపద కేంద్రాలను అభివృద్ధి పరచాలని జిల్లా పంచాయతీ అధికారి మంజులవాణి ఆదేశించారు. గురువారం తమ్మరాజుపల్లెలోని చెత్త సంపద కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. డీపీవో మాట్లాడుతూ చెత్త సంపద కేంద్రాల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామాభి వృద్ధికి వినియోగించాలన్నారు. వర్మీ కంపోస్టు తయారీ త్వరలో ప్రారంభిం చాలన్నారు. పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, శేషు, సిబ్బంది పాల్గొన్నారు.