Share News

ఎఫ్‌సీలు ప్రైవేటుకు ఇవ్వొద్దు

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:25 AM

వాహన రిజిస్ర్టేషన, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల మంజూరును ప్రైవేటుపరం చేయవద్దని సీఐటీయూ నాయకులు వెంకటేశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎఫ్‌సీలు ప్రైవేటుకు ఇవ్వొద్దు
పత్తికొండ ఆర్డీవో ఆఫీసు వద్ద నాయకుల ధర్నా

పత్తికొండ టౌన్‌, సెప్టెంబరు 11: వాహన రిజిస్ర్టేషన, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల మంజూరును ప్రైవేటుపరం చేయవద్దని సీఐటీయూ నాయకులు వెంకటేశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆటో అండ్‌ ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన, మోటారు వర్కర్స్‌ యూనియన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.

తుగ్గలి: డ్రైవింగ్‌ లైసెన్సులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లును ప్రభుత్వమే ఇవ్వాలని సీపీఎం అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్‌ చేశారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం వినతి పత్రం అందించారు.

ఎమ్మిగనూరు టౌన: వాహనాల సర్వాసులను ప్రైవేటుపరం చేయొద్దని సీఐటీయూ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం డీటీకి వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - Sep 12 , 2024 | 12:25 AM