పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు: డీఎస్పీ
ABN , Publish Date - Sep 17 , 2024 | 12:10 AM
పిల్లలకు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఇవ్వవద్దని, ప్రమాదాలు జరిగితే పెద్దలను బాధ్యులు చేస్తామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ హెచ్చరించారు.
కొత్తపల్లి, సెప్టెంబరు 16: పిల్లలకు ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఇవ్వవద్దని, ప్రమాదాలు జరిగితే పెద్దలను బాధ్యులు చేస్తామని ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ హెచ్చరించారు. సోమవారం దుద్యాల గ్రామ బస్టాండు సెంటరులో ఎస్ఐ కేశవ అధ్యక్షతన పోలీసు శాఖ పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల న్నారు. అలాగే ఓటీపీ ఫ్రాడ్స్, మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలపై వివరించారు. అనుమానితులు గ్రామాల్లో సంచరిస్తుంటే.. పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆధార్, బ్యాంకు అకౌంటు తదితరు వివరాలు ఎవరినైనా అడిగితే సమాచారం ఇవ్వొద్దని సూచించారు. ఆత్మకూరు సీఐ సురేష్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.