న్యాయ సంస్థలను తరలించొద్దు
ABN , Publish Date - Nov 21 , 2024 | 12:54 AM
కర్నూలునుంచి న్యాయ సంస్థలను తరలించి రాయలసీమకు అన్యాయం చేయొద్దంటూ న్యాయవాదులు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.
ఆదోనిలో న్యాయవాదుల ర్యాలీ, పత్తికొండలో రాస్తారోకో
ఆదోని రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలునుంచి న్యాయ సంస్థలను తరలించి రాయలసీమకు అన్యాయం చేయొద్దంటూ న్యాయవాదులు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలో బుధవారం బార్ అసొసి యేషన్ అధ్యక్షుడు సుందర్‌సింగ్, ఉపాధ్యక్షుడు మొలగవల్లి జనార్థన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించి, సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. కూటమి నాయకులు మౌనం వీడి కర్నూలు నుంచి న్యాయ సంస్క్థలను తరలించకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. రవికృష్ణ, వై.ఆర్.మల్లికార్జున, బషీర్ అహ్మద్, లోకేష్, జీవన్, శివప్రసాద్, బంగారయ్య, రామాంజనే యులు, నాగేంద్రయ్య, ఆనంద్, రజినీకాంత్ పాల్గొన్నారు.
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
పత్తికొండ టౌన్: కర్నూలులో ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరా వతికి తరలించవద్దంటూ పత్తికొండ న్యాయవాదులు బుధవారం విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి ఆద్వర్యంలో న్యాయవా దులు నాలుగు స్థంభాల కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమ ప్రాంతమైన కర్నూ లులో న్యాయసంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేశారని, కూటమి ప్రభుత్వం వీటిని అమరావతికి తరలించాలని చూస్తే ఉద్యమాన్ని ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదులు హుల్తన్న, నాగభూషణం రెడ్డి, అశోక్ కుమార్, రాజశేకర్ నాయుడు, మహేష్, ఎల్లారెడ్డి, సత్యనారాయణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.