Share News

వరిపై తుఫాన్‌ ప్రభావం

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:28 PM

నంద్యాల జిల్లాలో పెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు నేలవాలి గింజలు రాలిపోతున్నాయి.

వరిపై తుఫాన్‌ ప్రభావం
రుద్రవరం మండలం వెలగలపల్లె సమీపంలో తడిసిన వరి ధాన్యాన్ని ఆరబోస్తున్న అన్నదాతలు

నంద్యాల జిల్లాలో పెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు నేలవాలి గింజలు రాలిపోతున్నాయి. వరిధాన్యం తడిసిపోయింది. దీంతో పంటలను, ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టార్పాలిన్‌ పట్టలను కప్పి ఉంచారు. అయినా తుఫాన్‌ ప్రభావంతో ధాన్యం దెబ్బతింటుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వరికోతలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తుఫాన్‌ అలజడికి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

- ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌

Updated Date - Dec 02 , 2024 | 11:28 PM