Share News

మొరాయించిన ఈ నామ్‌ సర్వర్‌

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:33 AM

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ-నామ్‌ సర్వర్‌ సోమవారం సాంకేతిక సమస్యతో మొరాయించింది.

మొరాయించిన ఈ నామ్‌ సర్వర్‌
విక్రయానికి వచ్చిన పత్తి దిగుబడులు

పాత పద్ధతిలోని టెండర్‌ దాఖలు

ఆదోని అగ్రికల్చర్‌, అక్టోబరు 21, (ఆంధ్రజ్యోతి) : ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఈ-నామ్‌ సర్వర్‌ సోమవారం సాంకేతిక సమస్యతో మొరాయించింది. అప్రమత్తమైన కార్యదర్శి రామ్మోహన్‌ రెడ్డి సమస్య పరిష్కారం కావడానికి ఒక్కరోజు పట్టవచ్చని తెలియడంతో పాత పద్ధతిలోని టెండర్లు వేయాలని మైకు ద్వారా ప్రకటించారు. దేశవ్యాప్తంగా మార్కెట్‌ యార్డలో సర్వర్‌ పని చేయక పాత పద్ధతిలోనే టెండర్లను దాఖలు చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ పత్తి, వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు దిగుబడు లను రైతులు విక్రయానికి భారీగా తీసుకొస్తు న్నారు. ఇలాంటి సమయంలో సర్వర్‌ మొరాయి స్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తూకాలు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యాయి.

Updated Date - Oct 22 , 2024 | 01:33 AM