Share News

వరద నీటితో పంట భూమికి కోత

ABN , Publish Date - Jun 13 , 2024 | 11:43 PM

ఇటీవల కురిసిన భారీ వర్షానికి రాచెరువు సమీపంలోని కొండ వాగు నీరు పంట పొలాల్లోకి వెళ్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

 వరద నీటితో పంట భూమికి కోత

పాణ్యం, జూన్‌ 13 : ఇటీవల కురిసిన భారీ వర్షానికి రాచెరువు సమీపంలోని కొండ వాగు నీరు పంట పొలాల్లోకి వెళ్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సుగాలిమెట్ట గ్రామానికి చెందిన రైతు దేవనాయక్‌ తన ఐదెకరాల పొలంలో అరటి పంటను సాగు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి సమీప కొండల్లోని వాగు నీటి ప్రవాహం భారీగా రావడంతో దాదాపు ఆరడుగుల మేర మట్టి మేట వేసి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. గతంలో గాలేరు నగరి కాల్వ నిర్మాణంలేని సమయంలో కొండల్లోని వాగునీరు కాల్వ్లల రాజశేఖర్‌, ఆయన సతీమణి మల్లెల జ్యోతిలు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మల్లెల రాజశేఖర్‌ దంపతులను, మండల సమాక్య గౌరవ సలహాదారు విజయభారతి మల్లెల దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాల్వబుగ్గ మాజీ చైర్మన్‌ చంద్రపెద్ద స్వామి, ముస్లీం మైనార్టీ నాయకుడు మహబూబ్‌బాషా, కాపు సంఘం నాయకులు కేవీ మధు, టీడీపీ తెలుగు యువత మండల అధ్యక్షుడు రాము, మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవతలి వైపున ఉన్న వాగులోకి వెళే ్లది. ప్రస్తుతం కాల్వ అడ్డంగా ఉండడంతో నీరు పంటభూముల్లోకి చేరుతోందని తెలిపారు. ఈ సమస్యను గాలేరు నగరి అధికారులకు తెలిపామని గ్రామస్థులు అన్నారు. నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని దేవనాయక్‌ కోరారు. కాగా కాల్వ నిర్మాణం వల్ల తలెత్తిన సమస్య పరిష్కరిస్తామని జీఎన్‌ఎస్‌ఎస్‌ ఈఈ నాగరాజు ఆచారి తెలిపారు. పంట భూమిలోకి నీరు చేరకుండా కాల్వను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 11:43 PM