ఓల్డ్ బ్లడ్ బ్యాంకులో పది పడకల ఏఎంసీ ఏర్పాటు
ABN , Publish Date - Jun 06 , 2024 | 01:11 AM
అత్యవసర రోగుల సౌకర్యార్థం ఓల్డ్ బ్లడ్ బ్యాంకులో ఏఎంసీ విస్తరణలో కోసం అదనపు పది పడకలతో అక్యూట్ మెడికల్ కేర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెడెంట్ సి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
కర్నూలు(హాస్పిటల్), జూన్ 5: అత్యవసర రోగుల సౌకర్యార్థం ఓల్డ్ బ్లడ్ బ్యాంకులో ఏఎంసీ విస్తరణలో కోసం అదనపు పది పడకలతో అక్యూట్ మెడికల్ కేర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెడెంట్ సి.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆసుపత్రి ఆయన పలు విభాగాలను తనిఖీ చేశారు. రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మందులు ఇచ్చుకౌంటర్‌ను మరొక చోటుకు మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఓల్డ్ 24 గంటల ల్యాబ్ వద్ద వెయిట్ రూమ్ పనులను, స్టోర్, డ్రగ్ స్టోర్ రూమ్ న్యూడయోగ్నస్టిక్ బ్లాక్‌ను పరిశీలించారు. సూపరింటెండెంట్ వెంట సీఎస్‌ఆర్‌ఎంవో వెంకటేశ్వర రావు, ఏఆర్‌ఎంవో డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ శివబాల, సునీల్ ప్రశాంత్ ఉన్నారు.