కార్మికులను ఆదుకోవడంలో విఫలం
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:48 AM
కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో విఫలమైందని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వీరేష్, నాగరాజు అన్నారు.
వినూత్న రీతిలో నిరసన
ఎమ్మిగనూరు రూరల్, నవంబరు 10(ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడంలో విఫలమైందని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వీరేష్, నాగరాజు అన్నారు. ఆదివారం పట్టణంలోని సోమప్ప సర్కిల్‌లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు గొంతుకు ఉరితాడు బిగించికోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేఉచిత ఇసుక విధానం అమలు చేస్తామన్నారు. తక్షణమే ఉచిత ఇసుక విధానంపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పనులు లేక వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే స్వయంగా తుంగభద్ర నదిలో ఇసుకను తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు నరసింహులు, సుంకన్న, రామాంజినేయులు, నరసప్ప, రవి, వీరేష్, జగన్నాథ్, హనుమంతు, శ్రీనివాసులు, వెంకటేష్, రంగస్వామి, మునుస్వామి పాల్గొన్నారు.