ఆక్రమణదారుడిపై కేసు నమోదు చేయండి
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:18 PM
పొలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ నవ్య తహసీల్దార్ చంద్రశేఖరవర్మను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ నవ్య
వెల్దుర్తి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): పొలాన్ని ఆక్రమించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని జాయింట్ కలెక్టర్ నవ్య తహసీల్దార్ చంద్రశేఖరవర్మను ఆదేశించారు. గురువారం వెల్దుర్తి మండలం ఎస్. బోయనపల్లె గ్రామంలో సచివాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో జాయింట్ కలెక్టర్ నవ్య పాల్గొన్నారు. అబ్దుల్ హుసేన్ అనే రైతు జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చాడు. ఇందులో ఆయన... సర్వే నెంబరు 9లో 3 ఎకరాలు ప్రభుత్వం తనకు డీ పట్టా ఇచ్చిందన్నారు. టైటిల్ డీడ్, అడంగల్, పాసుబుక్‌లో రికార్డుపరంగా అన్నీ తనకు ఉన్నాయని, అయితే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన భూమిని ఆక్రమించాడని జాయింట్ కలెక్టర్ నవ్యకు విన్నవించుకున్నాడు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ... కబ్జా చేసిన వ్యక్తిపై 109 సీఆర్పీసీ సెక్షన్ కింద బైండోవర్ కేసు నమోదు చేయాలని తహసీల్దార్ చంద్రశేఖరవర్మను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకుడు కాంతారెడ్డి, సర్వేయర్ హేమంత్‌రెడ్డి, ఆర్‌ఐమస్తాన్, విఆర్వో ఉమన్న, సిబ్బంది పాల్గొన్నారు.