కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించండి’
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:31 AM
జనాభా అదుపునకు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని కలెక్టర్ పి.రంజిత్ భాషా సూచించారు.
కర్నూలు(హాస్పిటల్), జూలై 11: జనాభా అదుపునకు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని కలెక్టర్ పి.రంజిత్ భాషా సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించిన లబ్ధిదారులు బహుమతుల కోసం లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో కుటుంబ నియంత్రణ తాత్కాళిక పద్ధతి పీపీఐయుసీడీ విభాగంలో కడపకు చెందిన రంగమ్మ, అంతర ఇంజెక్షన్ విభాగంలో మంత్రాలయానికి చెందిన జానకీ ప్రియ, వ్యాసెక్టమీ విభాగంలో కర్నూలు గిప్సన్ కాలనీకి చెంది న మురళీధర్ రెడ్డిలను లక్కీడిప్ ద్వారా ఒక్కొక్కరికి రూ.5వేలు ప్రోత్సాహకా లను ప్రకటించారు.
బెస్ట్ డాక్టర్లుగా మైత్రి, మాధవీలత: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు (పీపీఐయూసీడీ) చేసిన ఇద్దరు వైద్యులను బెస్ట్ డాక్టర్లుగా డీఎంహెచ్‌వో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్బంగా ప్రకటించారు. పీపీఐయూసీడీలో ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికి చెందిన డా.కె.మైత్రి 172 ఆపరేషన్లు చేసి బెస్ట్ డాక్టరుగా నిలిచి రూ.8వేలు ప్రోత్సహాకాన్ని అందుకోనున్నారు. ఆదోని ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డా.మాధవీలత 101 ఆపరేషన్లతో రూ.5వేలు ప్రోత్సాహాన్ని అందుకోనుంది. బెస్టు ఆశా కార్యకర్తలుగా దైవందిన్నె పీహెచ్‌సీ కడిమెట్లకు చెందిన కె.రంగలక్ష్మి, ఇదే పీహెచ్‌సీకి చెందిన కె.తిమ్మాపురానిక చెందిన మహాలక్ష్మి, ఉత్తమ ఆశా కార్యకర్తలుగా ఎంపికయ్యారు. ఈ ఇద్దరిని ఒక్కొక్కరికి రూ.2,500లు ప్రోత్సాహంను ప్రకటించారు.