అధికారుల సలహాలు పాటించాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:44 AM
రైతులు వ్యవసాయాధికారుల సలహా లను తప్పక పాటించాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత సూచిం చారు.
సి.బెళగల్, సెప్టెంబరు 4: రైతులు వ్యవసాయాధికారుల సలహా లను తప్పక పాటించాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలత సూచిం చారు. బుధవారం మండలంలోని బురానదొడ్డి రైతు భరోసా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి మల్లేష్‌కుమార్ ఆధ్వర్యంలో లింగా కర్షణ బుట్టల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం బురానదొడ్డి గ్రామంలో వెంకటలక్ష్మమ్మ సాగు చేసిన పత్తి పంటను పరిశీలించారు. ఈసందర్భంగా శ్రీలత మాట్లాడుతూ ప్రతి రైతు పంట మార్పిడి తప్పని సరిగా చేసుకోవాలన్నారు. బురానదొడ్డి గ్రామంలో పత్తి సాగు చేస్తున్న రైతులకు ఆమె లింగాకర్షణ బుట్టలను అందజేశారు. ఈసమావేశంలో శాస్త్రవేత్తలు గిరీష్, వెంకటేశ్వర్లు, దస్తగిరి, శశిధర్‌రెడ్డి, ఏవోలు మల్లేష్ కుమార్, మధులత, ఎంపీఈవో వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.