ఘనంగా గణతంత్ర దినోత్సవం
ABN , Publish Date - Jan 26 , 2024 | 11:57 PM
గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు, కళాశాలలు, పాఠశాలల్లో, అలాగే వివిధ రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాల కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవం గురించి పలువురు వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అలరించాయి.
డోన్, జనవరి 26: డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను పట్టణ టీడీపీ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, ధర్మవరం గౌతమ్‌రెడ్డి, భరత్‌రెడ్డి ఆవిష్కరించారు. నాయకులు ఎస్‌ఎండీ రఫీక్, మిద్దెపల్లి గోవిందు, కృష్ణప్రసాద్, శంకర్, చక్రపాణి గౌడు, శ్రీరాములు, హుశేన్‌పీరా పాల్గొన్నారు.
డోన్(రూరల్): డోన్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, డీఎస్పీ కార్యాలయం వద్ద డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డీవో వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. డోన్ పట్టణంలోని ఆంజనేయస్వామి కొండపై మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. చిన్నమల్కాపురం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. డోన్‌లోని కొత్తబస్టాండు వద్ద ఉన్న జనసేన పార్టీ నూతన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. డోన్ జనసేన పార్టీ నాయకులు ఆలా మోహన్‌రెడ్డి, రాయల్ మల్లి, పరదేశి మహేష్ పాల్గొన్నారు.
బేతంచెర్ల: బేతంచెర్ల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల పోలీస్‌స్టేషన్‌లో సీఐ ప్రీతం రెడ్డి, నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ చలంరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో డా.సాగరిక, విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఏడీ మధుసూదన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
ప్యాపిలి: టీడీపీ అధికారంలోకి వస్తే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగలకు ఇళ్ల స్థలాలు అందిస్తామని టీడీపీ డోన్ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్‌డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌ఈ రాఘవేంద్ర, చిన్నసుంకయ్య, గండికోట రామసుబ్బయ్య, పి వెంకటేశ్వరరెడ్డి, రామ్మోహన్‌యాదవ్, నాగేంద్ర, సుదర్శన్, ప్రసాద్‌రెడ్డి, గండికోట పెద్దరామాంజినేయులు, ఏనుగమర్రి రాము తదితరులు పాల్గొన్నారు.
ప్యాపిలిలోని అన్ని ప్రభత్వ కార్యాలయాల్లో శుక్రవారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో తహసీల్దారు చంద్రశేఖర్‌వర్మ, ఎంపీడీవో ఫజూల్ రెహమాన్, ఆర్‌ఐ సుధాకర్‌రెడ్డి, వీఆర్వోలు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ కోర్టులో జూనియర్ సివిల్ న్యాయాధికారి ఈశ్వర్ ప్రసాద్, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటరామయ్య, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ రామ్మోహనరెడ్డి, ఎంఐ కార్యాలయంలో డీఈ గురు మూర్తి, కేసీ కార్యాలయంలో డీఈ దశరఽథరామిరెడ్డి, పీఆర్ కార్యాల యంలో డీఈ సుబ్బరాయుడు, పోస్టాఫీసులో పోస్టల్ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌలీశ్వరరెడ్డి సీనియర్ జీడీఎస్ ఇస్మాయిల్‌చే జెండాను ఎగుర వేశారు.
దొర్నిపాడు: దొర్నిపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ అమర్‌నాథ్‌రెడ్డి, తహసీల్దార్ జయప్రసాద్, పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుడు నాగేంద్ర, పశువైద్యశాలలో పశువైద్యాధికారి ధనుంజయుడు జెండాను ఎగురవేశారు.
ఉయ్యాలవాడ: ఉయ్యాలవాడ తహసీల్దారు కార్యాలయం వద్ద తహసీల్దారు రవికుమార్, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఉయ్యాలవాడ, మాయలూరు, హరివరం గ్రామ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేశారు. క్రీడల్లో ప్రతిభ కనరపరచిన విద్యార్థులకు బహుమ తులు అందించారు. జడ్పీటీసీ పుణ్మమ్మ, ఎంఈవో2 ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దారు తులసీక్రిష్ణ, ఆర్‌ఐ సత్తారు తదితరులు పాల్గొన్నారు.
రుద్రవరం: రుద్రవరం తహసీల్దరు కార్యాలయంలో తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్, ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో రేంజర్ శ్రీపతినాయుడు, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి, మండల పరిషత్‌లో ఎంపీపీ బాలస్వామి జెండాను ఎగురవేశారు. రుద్రవరం ఉన్నత, ఆదర్శ పాఠశా లలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో మధుసూదన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దారు మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
శిరివెళ్ల: మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, పాఠశాలల్లో గణతంత్ర వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శిరివెళ్లలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కేవీ సుబ్రమణ్యం, ఎంపీపీ నాయక్ మహమ్మద్ వశీం జాతీయ జెండాను ఆవిష్కరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
చాగలమర్రి: చాగలమర్రి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు ఇమ్రాన్, సుల్తాన, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో మహబూబ్‌దౌలా, ఎమ్మార్సీ కార్యాలయంలో ఎంఈవో అనూరాధ, న్యామతుల్ల, పశువైద్య కేంద్రంలో ఏడీఏ వరప్రసాదు, పోలీసు స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ గిరిబాబు, విద్యుత్ కార్యాలయంలో ఏఈ షాజహాన్ జెండాలను ఎగురవేశారు. బీసీ సంఘ కార్యాలయంలో ఆ సంఘ అధ్యక్షుడు లక్ష్మీనారాయణగౌడ్, గ్రంఽథాలయంలో రామచంద్రుడు, పంచాయతీ కార్యాలయంలో ఈవో నాగమణి జెండాను ఎగురవేశారు. బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా జెండా ఎగురవేశారు.
బనగానపల్లె: బనగానపల్లె మెజిస్ట్రేట్ కోర్డు జూనియర్ సివిల్ న్యాయాధికారి కిశోర్‌కుమార్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ, ఈవో ఖలీల్‌బాషా, వార్డు సభ్యులు జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీ ల్దారు కిశోర్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మానసవీణ, ఎంపీపీ లక్ష్మీదేవి, ఈవోఆర్‌డీ గురుప్రసాద్, సూపరింటెడెంట్ నాగరాజు జెండాను ఎగురవేశారు. పాతపాడు గ్రామంలో సర్పంచ్ మహేశ్వరరెడ్డి మిట్టపల్లెలో సర్పంచ్ తులసిరెడ్డి, సర్కిల్ కార్యాలయంలో సీఐ తిమ్మారెడ్డి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రామిరెడ్డి, నందివర్గం పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ తిరుపాలు ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో స్వరూప, మార్కెట్ యార్డులో చైర్మన్ దీవెనమ్మ, వైస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, ఆయుర్వేద ఆస్పత్రిలో డాక్టర్ మాధవరావుచౌదరి, బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెం డెంట్ డాక్టర్ సుజాత, టంగుటూరు వైద్యశాలలలో డాక్టర్ శివశంకరుడు, సిబ్బంది, పశువైద్యశాలలో ఏడీ మారుతిసకారాం, సిబ్బంది, మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, ఓబులేసు, సీడీపీవో కార్యాలయంలో సూపర్‌వైజర్లు సీడీపీవో ఉమామహేశ్వరమ్మ, సాలమ్మ జెండాను ఆవిష్కరించారు. ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏఈ సాయికృష్ణ, సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ శ్రీధర్ గుప్తా, మైనింగ్ కార్యాలయంలో ఏడీ రాజగోపాల్, మైనర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఏఈ రఘురాం, జెండాను ఎగురవేశారు.
కోవెలకుంట్ల: మేజర్ గ్రామపంచాయతీలో ఉపసర్పంచ్ సూర్య నారాయణరెడ్డి, సీఐ కార్యాలయంలో సీఐ రామాంజులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. డిగ్రీ కళాశాలలో జెండాను ఎగురవేశారు. కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్రహ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉపసర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. విగ్రహ ఏర్పాటుకు దాత అధ్యాపకుడు ఐనాగేశ్వరరెడ్డి అందించిన విరాళంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోవెల కుంట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్‌లో వివిధ సబ్జెక్టులలో ఉత్తమ ప్రతిభ కనబరచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండేకంటి సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి దంపతులు విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు.
అవుకు: అవుకు తహసీల్దారు కార్యాలయం వద్ద తహసీల్దారు ప్రసాద్ బాబు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, పోలీస్‌స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బంది, మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉపసర్పంచ్ రఘునాథరెడ్డి, వేములపాడు పంచాయతీ కార్యాలయవ వద్ద సర్పంచ్ సుబ్బలక్ష్మమ్మ, ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ వినోద్‌కుమార్, యమున జెండాను ఎగురవేశారు.
సంజామల: తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు మల్లిఖార్జున్ రావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నాగకుమార్, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కొండారెడ్డి, ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో హెచ్‌ఎం శ్రీనివాసులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పద్మావతి, పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐ నాగరాజు జెండాను ఆవిష్కరించారు. సంజాల ఉన్నత పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, బాలికలు చేసిన పిరమిడ్ విన్యాసం అలరించింది. కార్యక్రమాల్లో డీటీ అనిల్‌కుమార్, ఆర్‌ఐ వెంగళరెడ్డి సర్వేయర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.