ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
ABN , Publish Date - Sep 06 , 2024 | 01:26 AM
పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
డోన(రూరల్), సెప్టెంబరు 5: పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డోన పెన్షనర్ల సంఘం కార్యాలయంలో 75 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న రిటైర్డు ఉపాధ్యాయుడు శతావధాని దత్తాత్రేయ శర్మ, సుబ్బరాయుడు, జయరాముడులను పూలమాలలు, శాలువలతో సన్మా నించారు. పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కేఎన భానుసింగ్ పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలో రిటైర్డ్ గ్రంఽథాలయ అఽధికారి పల్లె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ముం దుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులరించారు. అనంతరం ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో అనాఽథ వృద్ధులకు పిం ఛన్లు పంపిణీ చేశారు. మాయలూరులో హెచఎం షరీఫ్‌ను శాలువా, పూల మాలలతో పల్లె నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు సన్మానించారు.
బనగానపల్లె: గురువును మించిన శిష్యులుగా విద్యార్థులు ఎదగాలని ఉమ్మడి జిల్లాల టెలికాం మాజీ అడ్వైజర్ మెంబర్, మాజీ సర్పంచ బీసీ రాజారెడ్డి అన్నారు. గురువారం బనగా నపల్లె పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. నియో జకవర్గంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందించి సన్మానించారు.
బేతంచెర్ల: మండలంలోని ముద్దవరం గ్రామంలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో లయన్స క్లబ్, వాసవి క్లబ్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యా యుడు తిమ్మప్పను సన్మానించారు. అమ్మవారిశాలలో వాసవి క్లబ్ ఆధ్వ ర్యంలో ఉపాధ్యాయులను సన్మానించారు.
ప్యాపిలి: పట్టణంలోని శ్రీసరస్వతి శిశుమందిరంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.