Share News

రీసర్వేపై కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:48 PM

కూటమి ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ గ్రామ సభలు శనివారంతో ముగిశాయి.

రీసర్వేపై కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు

జిల్లాలో 18,600 ఫిర్యాదులు

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ గ్రామ సభలు శనివారంతో ముగిశాయి. రెవెన్యూ గ్రామ సభల్లో రైతుల నుంచి దరఖాస్తులు కుప్పలతెప్పలుగా వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న భూసర్వే లోపాల పుట్టగా మారింది. జగన్‌ బొమ్మలు ముద్రించిన సర్వే రాళ్లను పాతి పెట్టడంలో చూపిన శ్రద్ధ భూముల హద్దులు చూపడంలో.. హక్కులు కల్పించడంలో చూపలేకపోయారు. ఫలితంగా సాగు విస్తీర్ణం నుంచి పాస్‌ పుస్తకాల్లో ముద్రించే పేర్లు, ఆధార్‌, ఫోన్‌ నెంబర్ల వరకు అన్ని తప్పులతడకలుగా కనిపిస్తున్నాయి. వందేళ్ల నాటి భూ సమస్యలను పరిష్కరిస్తామని గొప్పలు చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం భూ యజమానులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. గత నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలలో భూమస్యలపైౖ ఫిర్యాదులు వచ్చాయి. దాదాపు 18,600 మంది రైతులు ఫిర్యాదులు చేయడం జగనన్న భూ సర్వే డొల్లతనాన్ని చాటి చెబుతోంది. జిల్లాలో మొదటి విడతలో 67 గ్రామాల్లోని 1,35,260 ఎకరాలు, రెండో విడతలో 21 గ్రామాల్లో 73,060 ఎకరాలు, మూడో విడతలో 164 గ్రామాల్లో 5,37,180 ఎకరాల్లో రీసర్వే చేశారు.

18 వేలకు పైగా దరఖాస్తులు

ఆదోని డివిజన్‌లో ఆదోని 1058, పెద్దకడుమూరు మండలంలో 1566, మంత్రాలయం మండలంలో 1028, ఎమ్మిగనూరు మండలంలో 1080 దరఖాస్తులు వచ్చాయి.

కర్నూలు డివిజన్‌లో కల్లూరు మండలంలో 1636, కోడుమూరు మండలంలో 911, ఓర్వకల్లు మండలంలో 820, సి.బెళగల్‌ మండలంలో 779, వెల్దుర్తి మండలంలో 776 మంది దరఖాస్తు చేసుకున్నారు.

పత్తికొండ డివిజన్‌లో దేవనకొండ మండలంలో 912, తుగ్గలి మండలంలో 877, ఆలూరు మండలంలో 711, ఆస్పిరిమండలంలో 717 అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. రీసర్వే జరిగిన ప్రతి గ్రామాల్లో సరాసరిగా దాదాపు 300 దరఖాస్తులు రావడం గమనార్హం.

రైతులు ఇచ్చిన దరఖాస్తుల్లో..

ఆదోని డివిజన్‌లోని సరిహద్దుల్లో తేడాలు 61, జాయింట్‌ ఎల్‌పీఎం 1030, పొలం ఎక్కువ తక్కువ తేడాలు 4279, ఇతర సమస్యలు 338 ఉన్నాయి.

కర్నూలు డివిజన్‌లోని సరిహద్దులో తేడాలు 41, జాయింట్‌ ఎల్‌పీఎం 1164, పొలం ఎక్కువ తక్కువ తేడాలు 2999, ఇతర సమస్యలు 219 ఉన్నాయి.

పత్తికొండ డివిజన్‌లోని సరిహద్దులో తేడాలు 102, జాయింట్‌ ఎల్‌పీఎం 299, పొలం ఎక్కువ తక్కువ తేడాలు 3628, ఇతర సమస్యలు 72 దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో మ్యుటేషన్‌కి సం బంధించి ఆధార్‌ నెంబరు, ఫోన్‌ నెంబర్‌ పేరులో తప్పు లు తదితర వాటిలో ఆదోని డివిజన్‌లో 177 2, కర్నూలు డివిజన్‌లో 1195, పత్తికొండ డివిజన్‌లో 1291 దరఖాస్తులు రెవెన్యూ గ్రీవెన్స్‌కు వచ్చాయి.

Updated Date - Nov 16 , 2024 | 11:48 PM