మల్లన్న సన్నిధిలో హీరో నాగార్జున కుటుంబం
ABN , Publish Date - Dec 07 , 2024 | 12:16 AM
మల్లన్న సన్నిధిలో హీరో నాగార్జున కుటుంబం
శ్రీశైలం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శుక్రవారం సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం దర్శించుకుంది. నాగార్జునతో పాటు కుమారుడు నాగచైతన్య, కోడలు శోభితతో కలిసి దర్శించు కున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికా రులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు మల్లికార్జున స్వామివారికి అభిషేకం నిర్వహించి, భ్రమరాంబికాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు జరిపించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వీరికి ఆలయ అర్చకులు, వేదపండి తులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసా దాలను అందజేశారు. అభిమానులతో నాగార్జున ఫొటోలు దిగి సందడి చేశారు.