Share News

శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:18 AM

శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద భారీగా కొనసాగుతోంది. దాంతో సోమవారం డ్యాం అధి కారులు ఐదు క్రస్టుగేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు.

 శ్రీశైలానికి భారీగా ఇన్‌ఫ్లో

శ్రీశైలం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద భారీగా కొనసాగుతోంది. దాంతో సోమవారం డ్యాం అధి కారులు ఐదు క్రస్టుగేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్‌ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,17,539 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 51,324 క్యూసెక్కు లు మొత్తం 1,68,863 వరద నీరు వస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమాయానికి జలాశయానికి 1,64,963 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత పూర్తి స్థాయి నీటిమట్టం 884.30 అడుగుల కు చేరుకుంది. జలాశయం ఐదు క్రస్టుగేట్ల ద్వారా 1,38,770 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:18 AM