Share News

ఘనంగా వినాయక నిమజ్జనం

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:44 AM

: మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది.

 ఘనంగా వినాయక నిమజ్జనం
ప్యాలకుర్తిలో నిమజ్జనానికి తరలివెళ్తున్న గణనాథుడు

కోడుమూరు(రూరల్‌), సెప్టెంబరు 11: మండలంలోని పలు గ్రామాల్లో వినాయక నిమజ్జనం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. వాహనంపై విగ్రహాలను కొలువుంచి వీధుల గుండా ఊరేగిం చారు. మండలంలోని అమడగుంట్ల, ప్యాలకుర్తి గ్రామాల్లో ఎస్‌ఐ శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఊరేగింపులో ఎస్‌ఐ డ్యాన్స చేసి యువకు లను ఉత్సాహపరిచారు. అనుగొండలో వేలంలో లడ్డూను రూ. 22వేలకు క్రిష్ణ అనే యువకుడు కైవసం చేసుకున్నాడు.

కర్నూలు(ఎడ్యుకేషన్‌): 29వ వార్డు సొసైటీ కాలనీలో వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో బుధవారం గణేశ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక భక్త మండలి సభ్యులు వేణుగోపాల్‌, రామ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ విభాగం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుం జయాచారి పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్ర మంలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:44 AM