YSRCP: వైఎస్ జగన్‌కు ఊహించని షాక్
ABN , Publish Date - Dec 27 , 2024 | 07:12 PM
YSRCP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కి మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అమరావతి, డిసెంబర్ 27: వైసీపీకి వరుసగా షాక్ మీద షాక్‌లు తగులుతోన్నాయి. తాజాగా ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని వీడుతోన్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సేవ చేస్తానని ప్రకటించారు. ప్రజా సేవ కోసమే తాను ఐఏఎస్ నుంచి వీఆర్ఎస్ తీసుకుని.. రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. గత కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానన్నారు.
ఇక ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలిసిందేనని చెప్పారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో చర్చించిన అనంతరం రాజకీయాలకు సైతం దూరమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా, సామాజిక సృహ కలిగిన వ్యక్తిగా ప్రజా సేవ చేస్తానని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా కర్నూలు నగర వాసులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు.
రానున్న రోజుల్లో సామాజిక అసమానతలు, సమాజంలో రుగ్మతలను రూపు మాపేందుకు కృషి చేస్తానని ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. అందులోభాగంగా పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు పని చేస్తానన్నారు. అందుకోసం స్వచ్ఛంద సంస్థలతో, వ్యక్తులతో కలిసి పని చేయాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు ఇంతియాజ్ అహ్మద్ వివరించారు.
Also Read : కాలవలో పడిన బస్సు.. 8 మంది మృతి
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల వేళ..
ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగాలని ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ నిర్ణయించారు. ఆ క్రమంలో ఆయన వీఆర్ఎస్ సైతం తీసుకున్నారు. మరోవైపు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ కోసం .. నాటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే వారిని కాదని ఇంతియాజ్‌కు పార్టీ అధినేత టికెట్ కేటాయించారు.
Also Read: బియ్యం మాయం కేసులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
ఆ హోదా సైతం దక్కలేదు..
కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. గత ఎన్నికల్లో అంటే.. 2019లో 151 స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ.. 2024లో మాత్రం కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. మరోవైపు ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో.. ఆ పార్టీని నేతలు వీడుతోన్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు.. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పదవులకు సైతం రాజీనామా చేశారు. ఆ క్రమంలో ఇంతియాజ్ సైతం వైసీపీనీ వీడారు.
Also Read: కేంద్ర మంత్రి సన్నిహితుడిపై ఈడీ ఫోకస్
ఆ కారణం చేతనేనా..?
మరోవైపు ఇంతియాజ్.. వైసీపీలో చేరినా ఆయనకంటూ ఒక వర్గం లేదు. దీంతో కర్నూలు నగరంలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ వర్గాలు.. తామే నియోజకవర్గ ఇంచార్జ్‌లు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఓ ప్రచారం సైతం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండి.. ప్రజా సేవలో పాల్గొని ఇంతియాజ్ నిర్ణయించుకొన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: జాక్ పాట్ కొట్టిన ట్రాఫిక్ పోలీసులు
Also Read: మన్మోహన్ సింగ్ భావజాలం శాశ్వతంగా నిలిచి ఉంటుంది
కరోనా సమయంలో..
మరోవైపు కరోనా సమయంలో ఇంతియాజ్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో కర్నూలులో ఆయన తండ్రి చనిపోయారు. అలాంటి సమయంలో సైతం ఆయన విధులకు సెలవు పెట్టి..తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన లేదన్న సంగతి అందరికి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News