Share News

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:46 AM

జకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ రజక ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేంపెంట రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చండి
మాట్లాడుతున్న వేంపెంట రాంబాబు

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏపీ రజక ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేంపెంట రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బీసీ భవనలో జరిగిన రజక ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజకులు చాలీచాలని భత్యాలతో దుర్భ రమైన జీవితాలను గడుపుతున్నారని, మరికొన్ని చొట్ల గ్రామ బహిష్కరణలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ముఖ్య మంత్రి ఎన్టీఆర్‌ రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తూ కేబినెట్‌లో తీర్మాణం చేసి పార్లమెంటుకు పంపారని, కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం అనివార్య కారణాలతో పడి పోవడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింద న్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతూ బిల్లు అసెం బ్లీలో పెట్టి తీర్మాణం చేసి పార్లమెంటు బిల్లు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రజక ఐక్య సేవా సమితి కర్నూలు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు భారతి, కటారుకొండ సాయి కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 12:46 AM