విష్ణును విమర్శించే స్థాయి నీది కాదు
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:37 AM
కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇనచార్జి విష్ణువర్ధన రెడ్డిని విమర్శించే స్థాయి నాగరాజు యాదవ్‌కు లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ వేమన్న గౌడ్ అన్నారు.
టీడీపీ సీనియర్ నాయకులు
కర్నూలు, అర్బన, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇనచార్జి విష్ణువర్ధన రెడ్డిని విమర్శించే స్థాయి నాగరాజు యాదవ్‌కు లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ వేమన్న గౌడ్ అన్నారు. శనివారం నగరంలోని ఎనవీ రెడ్డి హో టల్లో కోడుమూరు నియోజకవర్గం సర్పంచుల సంఘం నాయకుడు జయన్నతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పసుపల సహకార సొసైటీ సంఘం భవనం లో మద్యం షాపు ప్రారంభించడంతో రైతులు, స్థానికులు, ఉద్యోగులు, వ్యాపారులు ఆందోళన చేశారని అన్నారు. దీన్ని ఎదురూరు విష్ణువర్ధన రెడ్డికి ఆపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. అసలు నాగరాజు యాద వ్ వెనుక ఉండి ఎవరు రాజకీయాలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాండ్రపాడు సర్పంచ జయన్న మాట్లాడుతూ ప్రజల్లో తమ స్థానం ఏంటో తెలుసుకొని నాగరాజు యాదవ్, సుధాకర్‌రెడ్డిలు మాట్లా డాలన్నారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి మద్యం సిండి కెట్ వ్యాపారాలు చేస్తున్న మీకు విష్ణువర్ధన రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవి రాకుండా అడ్డుకునే క్రమంలోనే ఇలాంటి కుట్ర రాజకీయాలకు తెగబడుతున్నారని సీనియర్ నాయకులు వీరన్న గౌడ్ ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో గోపాల్, సురేష్, మల్లికార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు.