అవుకును అభివృద్ధి పథంలో నడిపిస్తా
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:27 PM
అవుకు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
అవుకు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): అవుకు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కాలనీలో మొదటి విడతలో రూ. 30 లక్షలతో సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. రెండవ విడతలో మిగిలిన సీసీ రోడ్ల పనులు పూర్తి చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానన్నారు. అనంతరం కాలనీ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు చల్లా విజయభాస్కర్‌రెడ్డి, కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఐ.ఉగ్రసేనారెడ్డి, టీడీపీ ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరమణనాయక్, మండల నాయకులు బత్తిని మద్దిలేటిగౌడు, దంతెల రమణ, తిక్కన్న, మొట్ల రామిరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, ఎస్ రామకృష్ణారెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి, అరుణ్‌కుమార్, వెంకటరాముడు, మిద్దె ప్రసాద్, భాస్కర్‌రెడ్డి, పుల్లారెడ్డి ఈశ్వరయ్య, జయశివుడు తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి తనిఖీ : అవుకులోని ప్రభుత్వ ఆసుపత్రిని బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సూపరిండెంట్ డాక్టర్ అభినయ్‌తో కలసి ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించారు. రోగుల వద్దకు వెళ్లి డాక్టర్లు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవజ్ఞలైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఓపీ 300 ఉందని, ఇంకా పెంచే విధంగా డాక్టర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రవికుమార్, కళ్యాణ్‌శ్రీనివాస్, జయరాముడు, వినోద్‌కుమార్, సుష్మ, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రంలో చీకటి వీడి వెలుగులు : బీసీ
బనగానపల్లె: గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్రంలో చీకట్లు నింపిందని, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వెలుగులు వస్తున్నాయని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం దీపావళి సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు దీపావళి కానుకగా ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని మంత్రి ఆకాంక్షించారు.