భక్త కనకదాసు జయంతి
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:27 AM
భక్త కనకదాసు జయంతి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.
మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ర్యాలీలు
పత్తికొండ,నవంబరు18(ఆంధ్రజ్యోతి): భక్త కనకదాసు జయంతి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. కురవ కార్పొరేషన్ సభ్యుడు హోటల్ శ్రీనివాసులు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్‌నాథ్, కురువ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమలింగడు చిత్రపటానికి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేసింది టీడీపీ అన్నారు. కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు సీఎం చంద్ర బాబు ఆదేశాలు జారీచేయడం హర్షణీయమన్నారు. దీన్ని ప్రభుత్వసెలవుగా ప్రకటించాలని కోరారు. కేపీ బ్రహ్మయ్య, ఎరుకలచెరువు సురేంద్ర, కొత్తపల్లి అల్లెప్ప, అగ్రహారం హనుమంతు, క్రాంతిలింగన్న, తిక్కరమేష్, బురుజుల పక్కీరప్ప, చిన్నహుల్తిరంగన్న, ముత్తుకూరు చంద్రన్న ఉన్నారు.
ఆదోని టౌన్: జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అభినందనీయమని మాదాసి కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు గౌడ్ అన్నారు. సోమవారం విక్టోరియా పేటలో భక్త కనకదాస్ జయంతిని జరుపుకొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ హామీని అమలు చేయాలని కోరారు. గొర్రెల కాపరులుగా దుర్భర జీవితాలను గడుపుతు న్నారన్నారు. భాస్కర్, ఈరన్న, చౌడప్ప, కుబేర, రాజశేఖర్, ఉమామహేష్ పాల్గొన్నారు.
ఆలూరు రూరల్: మొలగవల్లి, పెద్దహోతూరు అరికేర, కమ్మరచేడు, మనేకుర్తి తదితర గ్రామాల్లో నివాళి అర్పించారు. మాదాసి మాదారి కురువ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్, టీడీపీ నాయకుడు కురవ దేవేంద్రప్ప, బెలగంటి హనుమప్ప, కురవ లక్ష్మి నారాయణ, సర్పంచులు వీరేశ్, కొల్లమ్మ, నాగరాజు లక్ష్మన్న, రామంజి నేయులు, గంజి మంగన్న, ఉరుకుంద, లక్ష్మిరెడ్డి, ఈరన్న, హరే రామ్, చంద్ర, ఉల్లెప్ప, సురేష్ లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.
హాలహర్వి: హాలహర్వి, నిట్రవట్టి, విరుపాపురం, గూళ్యం గ్రామాల్లో కనకదాస్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఊరేగింపు నిర్వహించారు.
ఆస్పరి: అలిగేర, ముత్తుకూరు గ్రామాల్లో నివాళులర్పించారు. ఎంపీటీసీ రహింతుల్లా, లక్ష్మణ్ణ, గంగాధర్ పాల్గొన్నారు.
హొళగుంద: పెద్దహ్యాట్ట మల్లయ్య, ఎస్ కేగిరి, వందవాగాలి శేషప్ప, ఎండీ హళ్లి వీరనగప్ప, సర్పంచ్ సుధాకర్ పాల్గొన్నారు.