Share News

29న మహానందిలో లక్ష బిల్వార్చన

ABN , Publish Date - Nov 23 , 2024 | 12:27 AM

కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈనెల 29న మహానంది ఆలయంలోని గర్భాలయంలో లక్షబిల్వార్చన నిర్వహిస్తున్నట్లు ఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

29న మహానందిలో లక్ష బిల్వార్చన
మహానందిలో మాట్లాడుతున్న ఈఓ శ్రీనివాసరెడ్డి

మహానంది, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఈనెల 29న మహానంది ఆలయంలోని గర్భాలయంలో లక్షబిల్వార్చన నిర్వహిస్తున్నట్లు ఈఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం మహానంది దేవస్ధానం ప్రధాన కార్యాలయంలో ఆలయ వేదపండితులు, అర్చకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 29న మహానందీశ్వరుడికి లక్షబిల్వార్చన, 30న కామేశ్వరీదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి స్వామి, అమ్మవార్లకు శాంతి కల్యాణం నిర్వహించడంతో మహానందిలో కార్తీక మాసోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు. ఈనెల 25న కార్తీక చివరి సోమవారం పురస్కరించుకుని క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో ఏఈఓ ఎర్రమల్ల మధు, పర్యవేక్షకుడు శశిధర్‌రెడ్డి, వేదపండితులు రవిశంకర్‌ అవధాని, ప్రధాన అర్చకులు అర్జునశర్మ, అర్చకులు జనార్ధన్‌శర్మ, శంకరయ్యశర్మ పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 12:27 AM