భూములను కాపాడాలి: కలెక్టర్
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:17 AM
వక్ఫ్, దేవదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని కలెక్టర్ పి.రంజిత బాషా అన్నారు.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్, దేవదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని కలెక్టర్ పి.రంజిత బాషా అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాలులో జిల్లా వక్ఫ్ ప్రొటెక్షన కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీములు ఏర్పాటు చేసి, ఆక్రమణలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎంటీ అని రికార్డు చేసి నివేదికను పది రోజుల్లోపు తనకు సమర్పించాలని ఆదోని సబ్ కలెక్టర్, కర్నూలు, పత్తికొండ ఆర్డీవో లను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో వక్ఫ్, దేవాదాయ భూములపై దృష్టి సారిం చాలని మున్సిపల్ కమి షనర్లను ఆదేశించారు. వక్ఫ్, దేవదాయ శాఖ భూములకు సంబంధించిన సర్వే నెంబర్ల పూర్తి వివరాలను మండల, డివిజన వారీగా తయారు చేసిన సబ్ కలెక్టర్, ఆర్డీవోలను అందజేయాలని డీఆర్వోను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, కర్నూలు నగర పాలక కమిషనర్ రవీంద్రబాబు, మైనార్టీ సంక్షేమ అధి కారి సబీహా పర్వీన, ఆదోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.