Share News

విద్యాభ్యాసనకు భాష అడ్డంకి కాకూడదు

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:43 AM

విద్యాభ్యాసనకు భాష అడ్డంకి కాకూడదని జాయింట్‌ కలెక్టర్‌ బి. నవ్య అన్నారు.

విద్యాభ్యాసనకు భాష అడ్డంకి కాకూడదు
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

ఘనంగా ఉర్దూ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం

కర్నూలు అర్బన్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): విద్యాభ్యాసనకు భాష అడ్డంకి కాకూడదని జాయింట్‌ కలెక్టర్‌ బి. నవ్య అన్నారు. శనివారం నగరంలోని డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ 8వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇన్‌చార్జి ఉపకులపతి ప్రొఫెసర్‌ పీఎస్‌ షావలి, పాలక మండలి సభ్యురాలు అజ్రాజావేద్‌, రిజిస్ర్టార్‌ లోక్‌నాథ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ భాషా అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కర్నూల్లో వర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం పీజీ, డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నారని, అందులో బాలికలు అధిక సంఖ్యలో చదువుకోవడం మంచి పరిణామం అన్నారు. పాలక మండలి సభ్యురాలు అజ్రాజావేద్‌ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగంలో ఉన్నత హోదాలో మహిళలు ఉండటం స్త్రీ శక్తి అభివృద్ధ్దికి నిదర్శనమన్నారు. ఇన్‌చార్జి ఉపకులపతి ప్రొఫెసర్‌ పీఎస్‌ షావలి మాట్లాడుతూ ఓర్వకల్లులో యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూస్థల సేకరణ తుది దశలో ఉందన్నారు. అనంతరం క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు జేఎండీ ఇబ్రహీం, నవీద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:43 AM